Telugu   English
 
This Website is under construction, Please let us know your sugesstions mailto:admin@basarkammasangam.com.

జగత్ర్పసిద్ధమైన వాగ్దేవి దేవాలయాలలో కాశ్మీరులోని ఆలయం తర్వాత బాసర జ్ఞాన సరస్వతి పేర్నొనదిగినది. వ్యాసమహర్షి ఈ ఆలయాన్ని నిర్మించాడని ఒక గాధ ప్రచారంలో ఉంది. వ్యాసపురి-వ్యాసర్ - బాసరగా రూపాంతరం చెందిందనేవాదం వుంది. ఇంతటి వైశిష్ట్యాన్ని పునికిపుచ్చుకున్నందువలననే మన రాష్ట్రాంలోని వారే కాకుండా యితర రాష్ట్రాల నుండి స్తెతం పసి పిల్లలకు "అక్షర స్వీకారం" చేయించడం సంప్రదాయంగా వస్తుంది. ఇచ్చట సరస్వతి విగ్రహం యిసుకతో చేయడం విశేషం. ఈ దేవాలయం అదిలాబాద్ జిల్లాలో బాసరలో గోదావరి నదీతీరంలో నిజామాబాదు పట్టణానికి దగ్గరగా ఉంది.

గోదావరి పుష్కరాల తరువాత ఈ పుణ్యక్ష్యేత్రము యొక్క ప్రాముఖ్యత , ప్రాచుర్యము ఎక్కువై భక్తులరాక అధికమైనది. అనేకమంది కమ్మవారు సుదూర ప్రాంతాల నుండి వారి పిల్లల అక్షరభ్యాసమును చదువుల తల్లియైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో చేయించుకోవాలని కుటుంబసమేతముగా విచ్చేస్తున్నారు. వారికి యిచ్చట భోజన మరియు వసతి సౌకర్యాలు లేక పోవుటవల్ల అనేక ఇబ్బందులకు గురియగుచున్నారు. కొన్ని కులములవారు వారి సోదరుల సౌకర్యార్ధము చాలా కాలము క్రిందటే నిత్యాన్నదానము మరియు వసతి సౌకర్యాలను ఏర్పరచినారు. ఇది గమనించి, ఈ కొరతను తీర్చు సంకల్పంతో బాసర మరియు నిజామాబాదు జిల్లా కమ్మవారు ముందుకు వచ్చి రూ" 21,00,000 (ఇరవై ఒక లక్షల రూపాయల) తో ఒక ఏకరము స్ధలమును తీసుకోవడం జరిగింది. ఈ స్ధలములో షుమారు నాలుగు, ఐదు కోట్ల వ్యయంతో 66(అరవ్తె ఆరు) గదులను అధునిక సౌకర్యములతో నిర్మించి, దానితోపాటు నిత్యాన్నదానము కొరకు అవసరమైన భోజనశాలను కూడా ఏర్పాటుచేయుటకు సంకల్పించినాము. మా యీ సత్సంకల్ప సాఫల్యము కొరకు మీ నహాయ సహకారములనర్ధిస్తూ సవినయంగా మీ ముందుకు వస్తున్నాము,మమ్ము సహృదయంతో ఆదరించి ఆర్ధిక సహాయము చేసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.

రెండు లక్షల రూపాయలు చెల్లించిన దాతలకు వారి పేరున 22'X15' సైజుగల ఒక గదిని నిర్మించి అందులొ ఆ దంపతుల చిత్ర పటమును, గది ముందు వారి గోత్ర నామములతో శిలా ఫలకమును ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంవత్సరమునకు యాభై(50) రోజులు ఉచితముగా వసతి సౌకర్యము కల్పించబడును.

రూ"పది లక్షలు ఆపైన ఇచ్చిన దాతలకు, ఒకవైపు అంతస్తునకు వారి పేరు పెట్టబడును. తగు స్ధలములో శిలాఫలకము ఏర్పాటు చేయబడును. శాశ్వత డైరెక్టర్ పదవితో పాటు, వారు కోరుకున్నప్ఫుడు వసతి సౌకర్యము కల్పించబడును.

మన కమ్మ కుల శ్రేయస్సు కొరుకు దయతో విరివిగా విరాళములిచ్చి మా యీ బృహత్ కార్యక్రమమును విజయవంతం చేయగలరని సవినయంగా మనవి చేస్తున్నాము.

విరాళాలను చెక్కు లేదా డ్రాప్టు ద్వారా శ్రీ జ్ఞాన సరస్వతి కమ్మ సేవా సమితి, బాసర పేరిట ఆంధ్రా బ్యాంకు బాసర శాఖకు పంపగలరు.